: పుట్టు మచ్చలు చూపేందుకు మధురై కోర్టుకు చేరుకున్న హీరో ధనుష్
దక్షిణాది నటుడు ధనుష్ తమ కుమారుడేనంటూ, కదిరేశన్, మీనాక్షి వేసిన పిటిషన్ పై నేడు మధురై కోర్టులో విచారణ సాగనుండగా, కోర్టు ఆదేశాల మేరకు ధనుష్ అక్కడికి చేరుకున్నాడు. ధనుష్ తమ కుమారుడని, తమ జీవనం కోసం అతన్నుంచి మనోవర్తి ఇప్పించాలని కదిరేశన్, మీనాక్షిలు డిమాండ్ చేస్తూ, ధనుష్ చిన్నప్పటి ధ్రువపత్రాలను కోర్టుకు అందించిన సంగతి తెలిసిందే. దానిలోని పుట్టుమచ్చల వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి, నేడు ధనుష్ ఒంటిపై వాటిని సరిపోల్చనున్నారు. పుట్టుమచ్చలను చూపేందుకు ధనుష్ కోర్టుకు రావాలని గతంలోనే నోటీసులు జారీ కాగా, నేడు ఆ కేసు విచారణ జరగనుంది.