: అమెరికాలో భారతీయులపై దాడుల నేపథ్యంలో ... సుష్మాస్వరాజ్‌కు వైఎస్ జగన్ లేఖ
విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లేఖ రాశారు. అమెరికాలో భారతీయులపై దాడులు జరుగుతున్న అంశంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైలెవెల్ కమిటీని అమెరికాకు పంపాలని ఆయన లేఖలో సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐల రక్షణకు చర్యలు తీసుకొని, వారిలో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాలని ఆయన చెప్పారు. ప్రధాని లేదా మీ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి బృందం అమెరికాకు వెళ్లాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.