modi: ఉత్తరప్రదేశ్ లో అధికారం మాదే.. ఒంటరిగానే అధికారంలో వస్తాం: మోదీ

ఉత్తరప్రదేశ్ లో అధికారం తమదేనని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. తాము ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఎవరి సాయం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మావులో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ప్రజల భవిష్యత్తుతో చెలగాటమాడాయని.. వాటి పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టేది తామేనని.. తమతో కలసి వచ్చే చిన్న పార్టీలకు మంత్రి వర్గంలో చోటు ఇస్తామని చెప్పారు. భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని.. యూపీ కూడా అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పేర్కొన్నారు.
modi
bjp
up elections

More Telugu News