: తలుపు తట్టిన పోలీసులు చాలా కూల్ గా నా జీవితంలోనే అత్యంత దారుణమైన వార్తను చెప్పారు: సునయన

తన భర్త మరణించిన విషయాన్ని ఇద్దరు అమెరికన్ పోలీసులు అత్యంత సాధారణమైన విషయంగా చెప్పారని కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన దూసుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ బీబీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ రోజు రావాల్సిన సమయానికి శ్రీను ఇంటికి రాకపోయేసరికి తాను ఆందోళనతో మెసేజ్ పెట్టానని, కాసేపట్లోనే వస్తామని చెప్పారని, ఆపై అలోక్ భార్య నుంచి తనకు వీరిద్దరూ ఎప్పుడూ ఏ బార్ కు వెళతారని అడుగుతూ మెసేజ్ వస్తే సమాధానం చెప్పానని అన్నారు. ఆపై ఫేస్ బుక్ లో వారు వెళ్లే బార్ వద్ద కాల్పులు జరిగాయని చూసి భయపడ్డానని, తన భర్తకు, 'వదినా' అంటూ పిలిచే అలోక్ కూ ఏమీ కాకూడదని ప్రార్థించానని అన్నారు.

ఆపై కొంతసేపటికి ఇద్దరు పోలీసులు తన ఇంటి తలుపు తట్టారని, వారిని చూడగానే ఏదో జరిగిందని అర్థమైందని అన్నారు. తన పేరు, తన భర్త పేరు, ఆయన పుట్టినతేదీ వంటి వివరాలను అడిగి, ఆపై నింపాదిగా, "నీ భర్త కాల్పుల్లో మరణించాడు" అని చెప్పారని, తన జీవితంలోనే అత్యంత దారుణమైన వార్త ఇదేనని సునయన వాపోయారు.

More Telugu News