: సలహా ఇవ్వండి, లక్షలు గెలవండి... రైల్వే శాఖ బంపరాఫర్

రైలెక్కితే నరకమే... ఎప్పుడు వస్తుందో, ఎక్కడ ఆగుతుందో తెలీదు... దీన్ని బాగు చేసే వాళ్లులేరా? ఇలా అనుకోని రైలు ప్రయాణికులు ఉండరు. ఇక తమకున్న చెడ్డ పేరు నుంచి బయటపడేందుకు రైల్వే శాఖ బంపరాఫర్ ప్రకటించింది. మొత్తం ఆరు రంగాలను ప్రకటించి, రైల్వే శాఖ పనితీరును మెరుగు పరిచేందుకు, ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సలహాలు, సూచనలను కోరింది. 'ఇన్నోవేషన్ చాలెంజ్' పేరిట పోటీని ప్రకటిస్తూ, ఏకంగా రూ. 84 లక్షల మేరకు బహుమతులను అందిస్తామని తెలిపింది. మే 20 లోగా 'మై గవ్ డాట్ ఇన్' వెబ్ సైట్ ద్వారా ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొంది.

More Telugu News