: సలహాలు కావాలంటే లక్షల మంది స్పందించారు: నరేంద్ర మోదీ
తాను అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును మరింత పారదర్శకం చేసేందుకు ప్రజల నుంచి సలహాలు కావాలని కోరితే, లక్షలాది మంది స్పందించి తమ విలువైన సూచనలు, సలహాలను అందించారని, వారందరికీ రుణపడి వుంటానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన నెలవారీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా, ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా ఆయన ప్రసంగించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన భీమ్ యాప్ పై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామని, నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలు గణనీయంగా పెరిగాయని అన్నారు.
రైతన్నల కష్టం ఫలించిందని, ఈ సంవత్సరం దాదాపు 2,700 లక్షల టన్నులకు పైగా ఆహార ధాన్యాల ఉత్పత్తి నమోదైందని తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇస్రో ప్రపంచ చరిత్ర సృష్టించిందని గుర్తు చేసిన మోదీ, ఒకేసారి అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపిన ఘనత ఒక్క భారత్ కు మాత్రమే దక్కిందని అన్నారు. మంగళ్ యాన్ వంటి పరీక్షల విజయవంతంతో భారత కీర్తి పతాక జగద్వితమైందని కొనియాడారు. యువతలో శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలు పెరగాలని, ఇండియాకు మరింత మంది సైంటిస్టుల అవసరం ఉందని అన్నారు. ఆసియా రగ్బీ సెవన్స్ ట్రోఫీలో రజత పతకం సాధించిన మహిళల జట్టును, అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు నరేంద్ర మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వీరి స్ఫూర్తి మరింత మందికి ఆదర్శమని అన్నారు.