: బ్లాక్ బెర్రీ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఆఖరి స్మార్ట్ ఫోన్


స్మార్ట్ ఫోన్ల మెగా ఈవెంట్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ప్రారంభానికి ముందు బ్లాక్ బెర్రీ తన చివరి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. సంస్థ ఇన్ హౌస్ లో తయారు చేసిన చివరి ఫోన్ ఇదే కానుంది. ఇకపై స్మార్ట్ ఫోన్ డిజైన్, తయారీ విభాగాలను బ్లాక్ బెర్రీ పూర్తిగా నిలిపివేయనుంది. 'కీవన్' పేరిట వచ్చిన ఈ ఫోన్ ధర రూ. 38,600 నుంచి రూ. 41,400 వరకూ ఉండనుంది,. ఈ ఫోన్ లో ఫిజికల్ కీ బోర్డుతో పాటు 4.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ ఎస్ఓసీ, 3 జీబీ ర్యామ్, 12/8 ఎంపీ కెమెరాలు, 32 జీబీ మెమోరీ, 3,505 ఎంఏహెచ్ బ్యాటరీ సదుపాయాలున్నాయి.

  • Loading...

More Telugu News