: ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్... ఉద్యోగ సృష్టికి అడ్డుపడే ఆంక్షల రద్దు
వ్యాపార అనుకూల దేశంగా అమెరికాను మరింత ఆకర్షణీయం చేయడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను జారీ చేశారు. ఉద్యోగాల కల్పనకు అడ్డుగా ఉన్న అన్ని రకాల ఆంక్షలనూ తొలగించాలని ఆయన నిర్ణయించారు. కంపెనీలపై అనవసర భారం మోపుతూ, ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ సృష్టికి, వ్యాపారానికి అడ్డంకులుగా ఉన్న ఆంక్షలను అధ్యయనం చేసేందుకు అంకితభావంతో పనిచేసే నిపుణులతో కూడిన ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, ఆయా ఆంక్షలు, నిబంధనలను సరళీకరించేందుకు, ఒకవేళ కుదరకపోతే , వాటిని రద్దు చేసేందుకు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. కాగా, కొన్ని మితవాద వార్తా సంస్థల ప్రతినిధులనే వైట్ హౌస్ మీడియా సమావేశాలకు ఆహ్వానించడంపై పెను రాద్ధాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే.