: నకిలీ నోట్ల కలకలం... మరోసారి ఏటీఎం నుంచి నకిలీ రూ. 2 వేల నోటు!

ఎన్నో క‌ట్టుదిట్ట‌మైన ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన రెండు వేల రూపాయ‌ల నోటుకు కూడా కేటుగాళ్లు న‌కిలీ నోట్ల‌ను త‌యారు చేస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. న‌కిలీ నోట్లు ఏకంగా ఏటీఎంల నుంచి కూడా వ‌స్తుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌క ఆయోమ‌య‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే ఢిల్లీలో ఓ ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ.8 వేలు డ్రా చేసుకున్న ఖాతాదారునికి నాలుగు న‌కిలీ రెండు వేల నోట్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని ఎస్‌బీఐ  ఏటీఎం నుంచి న‌కిలీ నోటు వ‌చ్చింది. ఓ ఏటీఎం నుంచి డ‌బ్బు డ్రా చేయ‌గా అత‌డికి రూ.2 వేల నకిలీ నోటు వచ్చింది. అది స్కాన్ చేసిన రూ.2 వేల నకిలీ నోటుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు.

More Telugu News