: ఆసీస్ స్పిన్ కు కుప్పకూలుతున్న టీమిండియా... స్కోరు 95/7


పూణే లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. మన స్పిన్ తో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తారనుకుంటే...  వారి స్పిన్ కు మన వాళ్లు బ్యాట్లు ఎత్తేస్తున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ మినహా... రెండంకెల స్కోరుకు చేరుకోవడం కూడా కష్టమే అన్నట్టుగా కొనసాగుతోంది మనవాళ్ల బ్యాటింగ్. కేవలం 95 పరుగులకు టీమిండియా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ బౌలర్లను కేవలం కేఎల్ రాహుల్ మాత్రమే సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 64 పరుగులు చేసిన రాహుల్ ఓకీఫే బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో విజయ్ 10, పుజారా 6, కోహ్లీ డకౌట్, రహానే 13, అశ్విన్ 1, సాహా డకౌట్ అయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2, ఓకీఫే 3, హాజిల్ వుడ్ 1, లియోన్ 1 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News