: కేసీఆర్‌కు ఆ విషయం తెలిసే తిరుమల వెళ్లారు: రాఘవులు


ఆంధ్రా దేవుడు కూడా తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటాడని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమ్మకం కుదిరిందని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. కేసీఆర్ తిరుమల పర్యటనపై స్పందించిన ఆయన మాట్లాడుతూ సీఎం తిరుమలను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రా దేవుడు కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాడని కేసీఆర్‌కు తెలిసొచ్చిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ విషయాన్ని గ్రహించి తెలంగాణ దేవుడి వద్దకు వెళ్లి రావడం మంచిదని సూచించారు. యాదాద్రో, భద్రాచలమో వెళ్లి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల తెలుగు ప్రజల మధ్య ఐక్యత కూడా పెరుగుతుందని రాఘవులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News