: ఏప్రిల్ 1 నుంచి ఈ ఐదు బ్యాంకుల పేర్లు మారిపోతాయి!


దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఘనమైన సేవలందించిన ఐదు బ్యాంకుల పేర్లు ఇక మారిపోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికానూర్ & జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అసోసియేట్‌ బ్యాంకుల పేర్లు మారిపోనున్నాయి. ఈ మేరకు ఈ నెల 16న కేబినెట్ అంగీకరించింది. గత మేలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ బ్యాంక్ ఈ ఐదు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు స్వాప్ రేషియో ఆధారంగా ఆగస్టులో ఆమోదం లభించింది. ఈ జాబితాలో భారతీయ మహిళా బ్యాంక్ ను కూడా చేర్చాలని డిమాండ్ ఉన్నప్పటికీ దానిని పెండింగ్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఐదు అనుబంధ బ్యాంకుల విలీనం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావడం ద్వారా పూర్తికానుంది. ఈ మేరకు ఎస్బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. ఈ విలీనంతో సిబ్బంది హోదాలు, జీతాల్లో ఎలాంటి మార్పులు ఉండవని ఎస్బీఐ పేర్కొంది. 

  • Loading...

More Telugu News