: ‘మార్కెట్’లో దూసుకెళ్తున్న రిలయన్స్.. 11 శాతం పెరిగిన షేర్ విలువ


సంచలన ఆఫర్లతో ముందుకొచ్చి రికార్డులు బద్దలుగొడుతున్న రిలయన్స్ జియో 4జీ సర్వీసుల టారిఫ్ విధానాన్ని ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు ‘ఇస్రో’ రాకెట్‌లా దూసుకెళ్లాయి. షేర్ విలువ ఏకంగా 11 శాతం పెరగడంతో మార్కెట్లో ఉత్సాహం తొణికిసలాడింది. జియో టారిఫ్ ధర ఆకర్షణీయంగా ఉండడం, వినియోగదారుల సంఖ్య పదికోట్లకు చేరుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. 2009 తర్వాత రిలయన్స్ షేర్లు ఇంతలా దూసుకుపోవడం ఇదే తొలిసారి.

నెలకు రూ.303 రీచార్జ్‌తో అపరిమిత కాల్స్‌తోపాటు రోజుకు 1జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చని జియో ప్రకటించిన విషయం తెలిసిందే. జియోను మరింత విస్తరిస్తున్నట్టు ముకేశ్ అంబానీ ప్రకటించడంతో మదుపుదార్లు ఈ షేర్లపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. టారిఫ్‌లు అందరికీ అందుబాటులో ఉండడం, ఆమోదయోగ్యంగా ఉండడం.. తదితర అంశాలు కూడా షేర్లు పెరగడానికి కారణమై ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News