: స్వచ్ఛంద సంస్థ ప్రకటనలో నటించి ఇరుక్కుపోయిన అమీర్ ఖాన్

స్వచ్ఛంద సంస్థ ప్రకటనలో నటించి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇరుక్కున్నాడు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు నిన్న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్నటి పేపర్ లో అమీర్ ఖాన్ కు సంబంధించిన ఒక ప్రకటన ఇంగ్లిష్, హిందీ పత్రికల్లో ప్రధానంగా కనిపించింది. దీని సారాంశమేంటంటే, ముంబైలోని పలు సమస్యలను ఏకరువు పెడుతూ, మీకు నచ్చినవారికి ఓటెయ్యండి అన్నది.

అయితే ఇది బీజేపీకి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ముంబై శాఖ ఆరోపిస్తోంది. అంతే కాకుండా అమీర్ నటించిన స్వచ్ఛంద సంస్థకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దీంతో అమీర్ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశాడని పేర్కొంటున్నాయి. సాధారణంగా ఎన్నికల కోడ్ లో భాగంగా ప్రచార గడువు ముగిసి ఎలక్షన్ జరిగే లోపు ఎలాంటి ప్రకటనలు విడుదల చేయకూడదు. అలా చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టే. దీంతో అమీర్ ఇబ్బందుల్లో పడనున్నాడు. 

More Telugu News