: ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు మరో షాక్ ఇచ్చిన పాక్
పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవలే 26/11 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయ్యద్‌ను గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అనంతరం ఆ ఉగ్రవాదిపై పలు ఆంక్షలు విధిస్తూ ఆ దేశ ప్రభుత్వం తాజాగా ఆయనతో పాటు మిగతా సభ్యులకు ఇచ్చిన 44 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది. తాము ఆయన కొనసాగిస్తోన్న సంస్థలపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశం విడిచిపోవద్దంటూ సయీద్‌తో పాటు మరో 37 మందిపై ఇటీవలే పాకిస్థాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.