: అత్యధిక డౌన్‌లోడ్లతో దూసుకుపోతున్న భీమ్ యాప్!

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విడుదలైన డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘భీమ్’ అత్యధిక డౌన్‌లోడ్లతో దూసుకెళుతోంది. ఈ యాప్‌కు ల‌భిస్తోన్న ఆద‌ర‌ణ గురించి ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలిపారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ యాప్‌ను ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు.

మొదట్లో ఈ యాప్‌లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు వ‌చ్చాయ‌ని, ప్రస్తుతం అటువంటివి లేవని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం ఈ యాప్ కోసం ఐవోస్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామ‌ని ఆయ‌న తెలిపారు. గత ఏడాది నవంబరు, డిసెంబర్ ‌కాలంలో యూఎస్ఎస్‌డీ ట్రాన్సాక్షన్లు 45 శాతం పెరిగాయ‌ని, న‌వంబ‌రు 8కి ముందు భార‌త్‌లో 8 లక్షల పీవోఎస్ మిషన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 28 లక్షలకు పెరిగింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

More Telugu News