: త్వరలోనే 1000 రూపాయల నోటు!

పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత సరికొత్త రూ. 2000, రూ. 500 నోట్లను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రూ. 1000 నోటును ప్రవేశ పెట్టేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఈ మేరకు కసరత్తు చేస్తున్నాయి. ఈ కసరత్తు తుది దశకు చేరుకున్నదని తెలుస్తోంది. వాస్తవానికి రూ. 2000 నోటును ప్రవేశ పెట్టినప్పుడు రూ. వెయ్యి నోట్ల ముద్రణను కూడా ప్రారంభించారు. అయితే, చిల్లర సమస్యలు ఎక్కువ అవడంతో, రూ. 500 నోట్ల ముద్రణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో, వెయ్యి నోట్ల రాక ఆగిపోయింది. 

More Telugu News