: పాకిస్థాన్ పై తొలి ఓవర్ లో హ్యాట్రిక్ నమోదు చేసిన స్వింగ్ కింగ్ ను పట్టించుకోని ఐపీఎల్!


సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఒక వెలుగు వెలుగి, స్వింగ్ కింగ్ గా పేరుతెచ్చుకుని ఈ మధ్య తండ్రిగా ప్రమోషన్ పొందిన ఇర్పాన్ పఠాన్ కు ఐపీఎల్ లో చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్ ఆరంభించిన అనంతరం తొలిసారి ఇర్ఫాన్ పఠాన్ ను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. 2006లో కరాచీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో తొలి ఓవర్ లోనే వరుస మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి పాకిస్థాన్ నడ్డివిరిచిన బౌలర్ గా పఠాన్ కు అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పాకిస్థాన్ తో జరిగిన ఆ సిరీస్ లో ఇర్ఫాన్ పఠాన్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతనికి స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది. అద్భుతమైన ఆల్ రౌండర్ గా ఎదుగుతాడని అతనిపై ఎన్నో అంచనాలు నెలకొన్న దశలో ఫాం కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి అడపాదడపా జట్టులోకి వస్తున్నా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక సతమతమవుతున్నాడు.

టీమిండియాలో మళ్లీ స్థానం సంపాదిస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన ఇర్ఫాన్, ఇప్పుడు ఐపీఎల్ నుంచి నిష్క్రమించడం అతనికి తీవ్ర నిరాశను రగులుస్తోంది. మరో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మకు కూడా ఐపీఎల్ లో మొడిచెయ్యి చూపించారు. ఏ జట్టూ అతనిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అలాగే టీమిండియా మిస్టర్ క్లీన్ ఛటేశ్వర్ పుజారాను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. వరల్డ్ నెంబర్ వన్డే బౌలర్ ఇమ్రాన్ తాహిర్ ను కూడా ఏజట్టు కొనుగోలు చేయకపోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. బంతితో మ్యాజిక్ చేయగల తాహిర్ ను కొనుగోలు చేయకపోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో ఆటోడ్రైవర్ కుమారుడైన హైదరాబాదీని, రోజు కూలీ కుమారుడైన తమిళ బౌలర్ లను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంపట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ వారి జీవితాల్లో వెలుగులు నింపిందని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News