: రాజ్‌భవన్‌కు చేరిన పళనిస్వామి బలపరీక్ష వీడియోలు!


తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్షకు సంబంధించిన వీడియో రాజ్‌భవన్‌కు అందింది. విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభలో జరిగిన విధ్వంసంపై నివేదిక ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదేశించారు. దీంతో ఆయన బల పరీక్షకు సంబంధించిన వీడియో ఆధారాలతో కూడిన నివేదికను రాజ్‌భవన్‌కు అందించారు.

మరోవైపు బలపరీక్షను అడ్డుకునేందుకు డీఎంకే సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. సభలో జరిగిన గందరగోళం, వాయిదా, డీఎంకే సభ్యులు సభాపతి కుర్చీలో కూర్చోవడం, రికార్డులను, మైకులను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు సంబంధించిన వీడియోలతో సమగ్ర నివేదిక రూపొందించిన అసెంబ్లీ సచివాలయం దానిని గవర్నర్‌కు అందించినట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News