: బెంగళూరు నడిబొడ్డున దారుణం...బస్సులో మంటలు.. మహిళ సజీవ దహనం.. పలువురికి గాయాలు!
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. బస్సుతో పాటు మహిళ సజీవ దహనమైన ఘటన చోటుుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చిక్ మగళూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ఇంజిన్ లో లోపంతో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి అంతా నిద్దురలో జోగుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ప్రయాణికులు అప్రమత్తమై మంటల బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు నుంచి దూకి తప్పించుకున్నారు. ఒక మహిళ ఈ మంటల్లో సజీవ దహనమైపోయింది. మరో ఇద్దరు ప్రయాణికులు మంటల ధాటికి తీవ్రంగా గాయపడ్డారు. 27 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అందరూ చూస్తుండగా బస్సు మంటల్లో కాలి బూడిదైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నారు.