: భావనలా నేను కూడా వేధింపులకు గురయ్యాను: కోలీవుడ్ నటి వరలక్ష్మి ఆవేదన
సినీ నటి భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న వార్తలు వెలువడిన నాటి నుంచి దేశవ్యాప్తంగా సినీ నటుల నుంచి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె, నటుడు విశాల్ ప్రియురాలు వరలక్ష్మి కూడా లైంగిక వేధింపులకు గురయ్యిందన్న వార్త మరింత కలకలం రేపుతోంది. అయితే తాను భావనలా కిడ్నాప్ కు గురి కాలేదని, ఓ టీవీ చానెల్ స్టూడియోలో ఈ అనుభవం చవిచూశానని తెలిపింది.
ఓ ఇంటర్వ్యూ నిమిత్తం ఓ ఛానెల్ కు వెళ్లగా అక్కడి ప్రోగ్రాం హెడ్ అసభ్య పదజాలంతో తనను వేధింపులకు గురిచేశాడని, దీంతో తాను అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చేశానని తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ లేఖ రాశారు. అసలు సమాజంలో ఏం జరుగుతోందంటూ ఆమె ప్రశ్నించారు. మహిళల భద్రత జోక్ గా మారిపోయిందని, మలయాళ నటికి మద్దతుగా నిలుస్తున్నానని, అలాంటి వ్యక్తులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.
Needs to be said..!! pic.twitter.com/GjJimBIKd3
— varu sarathkumar (@varusarath) 20 February 2017