: నాకు ప్రాణ హాని ఉంది.. చెన్నై జైలుకి పంపండి: అధికారులకు శశికళ లేఖ
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తోన్న శశికళ నటరాజన్ ఆ జైలు నుంచి తమిళనాడులోని జైలుకి మారాలని ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ విషయంపైనే ఓపక్క అన్నాడీఎంకే నేతలు ప్రయత్నాలు జరుపుతుండగా, శశికళ కూడా ఈ రోజు పరప్పణ అగ్రహార జైలు అధికారులకు లేఖ రాశారు. తనకు ఈ జైలులో ప్రాణ హాని ఉందని, తనను చెన్నైలోని జైలుకి పంపించాలని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వినతిపై స్పందించిన సదరు జైలు అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తామని అన్నారు.