: ఫేస్‌బుక్‌లో పరిచయం.. వివాహేతర సంబంధం.. అడ్డంగా దొరికిపోయిన ఎస్సై
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా పెరిగిపోతున్న నేరాలను నిరోధించడానికి యువతకు సూచనలు చేయాల్సిన అతడే తప్పు దారిలో పయనించాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదంతా ఓ ఎస్సై జరిపిన తతంగం. ఖమ్మం టూటౌన్ ఎస్సైగా పనిచేస్తోన్న విజయ్ ఫేస్ బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. వారి మధ్య పరిచయం పెరిగి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
హైదరాబాద్‌లోని మోతీనగర్ కామధేను అపార్ట్‌మెంట్‌లో వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా గుర్తించిన సదరు మహిళ భర్త పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సై విజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.