: ఎన్టీఆర్ గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు?: నాదెండ్ల


‘మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు?' అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ లో పాజిటివ్ విషయాలు నేనైతే గ్రహించలేదు. అతని గురించి ఏం మంచి ఉందని చెప్పమంటారు? ఆయనలో మంచి ఏమిటంటే.. ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను కూడా ‘రండి’ అంటూ గౌరవిస్తారు. ఎన్టీఆర్ తన భార్యను కూడా ‘రండి’ కూర్చోండి అంటాడు’ అని అన్నారు. తానేమి ఇంటెలెక్చువల్ ని కాదని, అలా అయితే, రామారావు చేతిలో తాను వెన్నుపోటుకు ఎందుకు గురవుతానంటూ తనదైన శైలిలో అన్నారు. రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు కనుక, సినిమా వాళ్లు సీఎంలు అయ్యారని ఒక ప్రశ్నకు సమాధానంగా నాదెండ్ల సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News