: పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే ఆనాడు కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం!: నాదెండ్ల
స్వయంగా ఎన్టీఆరే తన అల్లుడు చంద్రబాబును తార్పుడు గాడు అని, రెండు వందల కోట్లు తినేశాడని అన్నారని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ ను నేను వెన్నుపోటు పొడిచాననడం చాలా తప్పు. ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ కు నేను వెన్నుపోటు పొడిచాననేది.. పత్రికలు చేసిన పని. పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం. గంగా, యమున ఏకమయ్యాయి, కనుక, కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. నా మూలంగానే టీడీపీ పుట్టింది. సినిమాల్లో హీరోగా ఆయన కనపడ్డా, నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన. టిక్కెట్ల ఎంపికలో మా ఇద్దరిలో ఎవరిదీ పైచేయి కాదు. ఇద్దరం చాప వేసుకుని కూర్చున్నాము. ఎన్టీఆర్ అయితే, అసలు పోటీ చేయనని కూర్చున్నాడు. ఎందుకంటే, భయం.. ఓడిపోతానని భయం. ఎన్టీఆర్ వియ్యంకులు ఆయన్ని డిస్కరేజ్ చేశారు. మానవ నైజం చెబుతున్నాను.. ఎంత ధైర్యస్తులో అంత పిరికివాళ్లు కూడా’ అని నాదెండ్ల చెప్పుకొచ్చారు.