: ఈ ఇద్దరి దర్శకత్వంలో నటించాలని ఉంది: రకుల్ ప్రీత్ సింగ్


ప్రముఖ దర్శకులు మణిరత్నం, ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయాలని తనకు ఉందని, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని నటి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, దర్శకులు సుకుమార్, మురుగదాస్ దర్శకత్వంలో నటించానని, అదే విధంగా మణిరత్నం, రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని ఉందని చెప్పింది. వారి సినిమాల్లో నటించడం ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని చెప్పింది. అయితే ఫలానా హీరోతో నటించాలనేదేమీ తనకు లేదని, స్క్రిప్ట్ బాగుంటే ఎవరితోనైనా నటిస్తానని, ‘గ్లామర్ డాల్’ అని పిలిపించుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. కాగా, గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన రకుల్ నటించిన ‘విన్నర్’ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News