: భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల వెనుక సినీ ఇండస్ట్రీ వ్యక్తులు... మరో ఇద్దరు అరెస్ట్


శుక్రవారం రాత్రి దక్షిణాది నటి భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురిలో ఇద్దరు డ్రైవర్లు మినహా మిగతావారంతా సినీ ఇండస్ట్రీతో సంబంధాలున్నవారేనని, వీరు పలు ప్రొడక్షన్ ఉద్యోగాలు చేస్తున్నారని కేసును విచారిస్తున్న పోలీసులు తెలిపారు. భావన కిడ్నాప్ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు అడిషనల్ డీజీపీ బీ సంధ్య నేతృత్వంలో దినేంద్ర కస్యప్ ను విచారణ అధికారిగా నియమించగా, కేసులో మరో ఇద్దరిని కోయంబత్తూరులో అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

మొత్తం ఆరుగురికి కేసులో భాగం ఉందని, ఇప్పటివరకూ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. కాగా, ఈ విషయంలో మీడియాతో ఎక్కువగా మాట్లాడవద్దని భావనకు సలహా ఇచ్చామని, సాధ్యమైనంత త్వరగా నిందితులందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మలయాళం సినీ పరిశ్రమలోని నిందితులకు, బాధితురాలికి మధ్య గతంలో ఉన్న సంబంధాలు చెడిపోవడంతోనే వారు పగబట్టి ఈ కిడ్నాప్ ప్లాన్ చేశారని తెలిపారు. కాగా, రాష్ట్రంలో సెలబ్రిటీలకే రక్షణ లేకుండా పోయిందని కేరళ విపక్ష నేత రమేష్ చెన్నితాల విమర్శించారు.

  • Loading...

More Telugu News