: బ్రేకులో తన వర్గ ఎమ్మెల్యేలతో పన్నీర్ భేటీ.. పళని వర్గ ఎమ్మెల్యేలను ఇటువైపు లాగే ప్రయత్నం


తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘర్షణ పూరిత వాతావరణం నేపథ్యంలో స్పీకర్ ధన్ పాల్ సభను ఈ రోజు ఒంటిగంట‌వ‌ర‌కు వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌న్నీర్ సెల్వం త‌న వ‌ర్గ ఎమ్మెల్యేల‌తో అక్క‌డి ప్రాంగ‌ణంలో భేటీ అయ్యారు. ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఎమ్మెల్యేల‌ను త‌మ వైపుకి లాగాల‌ని ఆయ‌న మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. దొరికిన‌ ఈ అర్ధ‌గంట స‌మ‌యంలో వారి మ‌న‌సు మార్చేందుకు ప‌న్నీర్ సెల్వం వ‌ర్గీయులు మాత్ర‌మే కాకుండా డీఎంకే నేత‌లు కూడా ప్ర‌య‌త్నాలు జ‌రపాల‌ని చూస్తున్నారు. అయితే, త‌మ ఎమ్మెల్యేల‌ను ప‌న్నీర్ వర్గం క‌ల‌వ‌కుండా ప‌ళ‌నిస్వామి మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో వారు స‌ద‌రు ఎమ్మెల్యేల వ‌ద్ద నుంచి క‌ద‌ల‌డం లేదు. న‌లుగురు ఎమ్మెల్యేల‌కు ఒక మంత్రి చొప్పున ఉన్నారు.

  • Loading...

More Telugu News