: తీవ్ర అస్వస్థతకు గురైన డీఎంకే ఎమ్మెల్యే.. అసెంబ్లీ నుంచి ఆసుపత్రికి తరలింపు
తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో డీఎంకే ఎమ్మెల్యే దురైమురుగన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను సభలో నుంచి స్ట్రెచర్ పై తీసుకొచ్చి, ఆంబులెన్స్ లోకి ఎక్కించి, ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటే వైద్యులు కూడా ఆంబులెన్స్ లో వెళ్లారు. ఆంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న సమయంలో, దురైమురుగన్ తన ఛాతీని పట్టుకుని ఉన్నట్టు కనిపించింది. ఈ నేపథ్యంలో, సభలో ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారా? లేక మరేదైనా జరిగిందా? అనే విషయం తెలవాల్సి ఉంది.