: రైళ్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. ఏకంగా 160 మంది ప్రయాణికులకు జరిమానా
ఎంచక్కా ఇంటి నుంచి తయారై వస్తున్నారు. టిక్కెట్టు తీసుకోకుండానే, తమ వద్ద పాస్ లేకుండానే రైలు ప్రయాణం చేసేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రతిరోజూ ఈ తతంగం నడుపుతున్నారు. రైలు ప్రయాణం ఫ్రీ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల్లో చాలా మంది ఇలాగే వ్యవహరిస్తున్నారని గుర్తించిన రైల్వే అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ఉందానగర్ రైల్వే స్టేషన్లో ఈ రోజు ఉదయం ఆకస్మిక తనిఖీలు జరిపారు. రైల్వే చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో భాగంగా సుమారు 12 రైళ్లలో క్షుణ్ణంగా ప్రయాణికుల టికెట్లను చెక్ చేశారు. దీంంతో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 160 మంది ప్రయాణికులను గుర్తించి, వారికి జరిమానా విధించారు.