: అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. సభను వాయిదా వేయాలంటూ పట్టుబడుతున్న స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకే, డీఎంకే ఎమ్మెల్యేల నినాదాలతో సభ హోరెత్తుతోంది. రహస్య ఓటింగ్ ను స్పీకర్ తిరస్కరించడాన్ని స్టాలిన్ తప్పుబడుతున్నారు. తీవ్ర గందరగోళం నేపథ్యంలో, సభను వాయిదా వేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. అంతేకాదు, రహస్య ఓటింగ్ ను మాత్రమే నిర్వహించాలని ఆయన పట్టుబడుతున్నారు. పన్నీర్ సెల్వంకే తన మద్దతని చెప్పారు.
ఎమ్మెల్యేలను ఖైదీలను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారని మండిపడ్డారు. బల పరీక్షకు 15 రోజుల గడువు ఉంటే... ఇంత హడావుడిగా ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. రహస్య ఓటింగ్ తోనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అయితే, అసెంబ్లీని వాయిదా వేయడానికి స్పీకర్ నిరాకరించారు. ఓటింగ్ ను ఆయన కొనసాగిస్తున్నారు.