: అసెంబ్లీలో చీఫ్ విప్‌గా సెమ్మలైని నియమించిన మధుసూదనన్
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో బల నిరూపణ పరీక్ష ఎదుర్కుంటున్న నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్(పన్నీర్ సెల్వం వర్గం) శాసనసభలో చీఫ్ విప్‌గా సెమ్మలైని నియమించారు. మరోవైపు రహస్య ఓటింగ్ కోసం అసెంబ్లీలో పన్నీర్ సెల్వం వర్గం పట్టుబడుతోంది. అసెంబ్లీకి ఇప్పటివరకు మొత్తం 230 మంది ఎమ్మెల్యేలు హాజరయినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో తమ రాష్ట్ర సీఎం పళనిస్వామి భవితవ్యం తేలిపోతుండడంతో ఆ రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సభ ప్రారంభం కావడంతోనే తీవ్ర గందరగోళం నెలకొంటుండడంతో ఓటింగ్ అంశం మరింత ఉత్కంఠగా మారింది. పన్నీర్ సెల్వం తిరుగుబాటు ప్రభావం బలపరీక్షలో ఎంతగా పడనుందో వేచిచూడాలి.