: ఏం జరుగుతోంది?.. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను బంద్ చేసిన స్పీకర్


తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి సభ విశ్వాసాన్ని కోరారు. అసెంబ్లీకి 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సభలోని ఎమ్మెల్యేలు పోటా పోటీ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పన్నీర్ సెల్వంకు మద్దతుగా డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, డీఎంకేకి వ్యతిరేకంగా పళనిస్వామి వర్గ ఎమ్మెల్యేలు నినదిస్తున్నారు. రహస్య ఓటింగ్ కోసం స్టాలిన్, పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలను అసెంబ్లీ స్పీకర్ నిలిపివేశారు. దీంతో, లోపల ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News