: రిసార్టు నుంచి బయల్దేరిన పళనిస్వామి వర్గం ఎమ్మెల్యేలకు చేదు అనుభవం
కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బలనిరూపణ పరీక్ష ఎదుర్కుంటుండడంతో గోల్డెన్ బే రిసార్ట్ నుంచి ఆయన వర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులో సదరు ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ వారిని అడ్డుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నినాదాలు చేసి, గందరగోళం సృష్టించారు. వారిపై దాడికి యత్నించారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భద్రత నడుమ సదరు ఎమ్మెల్యేలను పోలీసులు తిరిగి అసెంబ్లీకి తరలించారు. అసెంబ్లీ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు. ఆ పరిసరాల్లో మొత్తం 2 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేగాక అదనపు బలగాలను సైతం సిద్ధంగా ఉంచారు.