: పక్క సెల్లోనే ఆరుగురిని చంపిన సైనేడ్ మల్లిక.. శశికళతో మాట్లాడే ప్రయత్నం చేసిన హంతకురాలు!
అక్రమాస్తుల కేసులో శశికళ నటరాజన్‌కు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని జైలులో ఉంటున్న ఆమె పక్క సెల్లోనే ఆరు హత్యలు చేసిన సైనేడ్ మల్లిక ఉందట. ఆమె గతంలో దేవాలయాల్లో పలువురు మహిళలను పరిచయం చేసుకొని.. వారి నుంచి బంగారం దోచుకునేది. ఈ క్రమంలో మల్లిక ఆరుగురు మహిళలను సైనేడ్ విషం పెట్టి చంపేసింది. ప్రస్తుతం మల్లిక తన పక్క సెల్లోనే ఉన్న శశికళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తోందని బెంగళూరు మిర్రర్ పత్రికలో ఓ వార్త వచ్చింది. ఇప్పటివరకు ఆమెతో మాట్లాడని శశికళ నిన్న మాత్రం ఆమెని చూసి చిరునవ్వు నవ్విందట.