: పళనిస్వామి..నన్ను చూసి నవ్వొద్దు.. మీకు మంచిది కాదు!: స్టాలిన్


గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పన్నీర్ సెల్వం, డీఎంకే నేత స్టాలిన్ పరస్పరం నవ్వుకున్నారంటూ శశికళ ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. వారిద్దరూ నవ్వుకోవడం వల్ల ఏదో కుట్ర జరుగుతోందని శశికళ భావించారని, అందుకే, పన్నీర్ సెల్వంను సీఎం పదవి నుంచి తప్పించారనే వార్తలు హల్ చల్ చేయడం విదితమే. ఈ నేపథ్యంలో, డీఎంకే నేత స్టాలిన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన పళనిస్వామికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా స్టాలిన్ కు ఓ సూచన కూడా చేశారు. అసెంబ్లీలో ఉన్నప్పుడు, తనను చూసి నవ్వొద్దని, ఆ విధంగా చేయడం పళనిస్వామి పదవికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆయన చమత్కరించారు. బెంగళూరు జైలులో ఉన్న శశికళ నుంచి సలహాలు, సూచనలు పాటించకుండా పళనిస్వామి స్వతంత్రంగా వ్యవహరించాలని స్టాలిన్ సూచించడం గమనార్హం.

  • Loading...

More Telugu News