: నా తండ్రి అసమాన నాయకుడు, ధీశాలి, యోధుడు.. ఐ లవ్ యూ డాడ్: కేటీఆర్

తన తండ్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కన్న అతి గొప్ప కుమారుడు తన తండ్రి అని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసమానమైన నాయకుడు, ధీశాలి, యోధుడు తన తండ్రి అంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'హ్యాపీ బర్త్ డే డాడ్' అని ట్వీట్ చేశారు. ఆయన కొడుకుగా పుట్టడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. దీనికితోడు, ప్రత్యేకంగా డిజైన్ చేయించిన కేసీఆర్ ఫొటోను కేటీఆర్ అప్ లోడ్ చేశారు. అందులో తీక్షణంగా చూస్తున్న కేసీఆర్ ఉన్నారు. అంతేకాదు యుద్ధం, శాంతి అనే ఇంగ్లీష్ పదాలు కూడా ఉన్నాయి.

More Telugu News