: భారీ నజరానా మీద కన్నేసిన టీమిండియా!


కోహ్లీ సారధ్యంలోని టీమిండియా విజయాలతో మంచి ఊపు మీదుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా భారీ నజరానాపై కన్నేసింది. ప్రతిఏటా ఏప్రిల్ 1వ తేదీ వరకు టెస్టుల్లో జట్ల ప్రతిభ ఆధారంగా వరల్డ్ నెంబర్ వన్ జట్టుకు ఐసీసీ నజరానా అందజేస్తుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ నెంబర్ వన్ టెస్టు జట్టుకు మిలియన్ డాలర్ల (6.70 కోట్ల రూపాయల) నజరానా అందజేస్తుంది. ఈ నేపథ్యంలో అద్భుతమైన ఆటతీరుతో దూసుకెళ్తున్న భారత జట్టు (121) వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. వరల్డ్ నెంబర్ టూ ర్యాంక్ జట్టు ఆస్ట్రేలియా (109) తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో ఆసీస్ కు అవకాశం ఇవ్వకుండా చేయడం ద్వారా భారత్ భారీ నజరానాను సొంతం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో తొలిటెస్టులో విజయం సాధించడం ద్వారా తమ రెండు జట్ల మధ్య పాయింట్ల పట్టికలో భారీ వ్యత్యాసముండేలా చూసుకోవాలని ప్లాన్ వేస్తోంది. ఒకవేళ తొలి టెస్టులో గెలిచి, తరువాతి మ్యాచ్ లలో ఓటమిపాలైనా భారత్ ర్యాంకుకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. అయితే ఈ సిరీస్ లో ఒక డ్రా, మూడు విజయాలతో ఆసీస్ ముగిస్తే మాత్రం ఆసీస్ నెంబర్ వన్ గా, భారత్ నెంబర్ టూగా మారతాయి. అప్పుడు భారత్ భారీ నజరానా ఆశలు అడియాసలవుతాయి. 

  • Loading...

More Telugu News