: చిన్న కోడలి కోసం రంగంలోకి దిగిన ములాయం


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించిన అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇప్పటి వరకు ఎలాంటి సభలోనూ పాల్గొనలేదు. అలాంటి ఆయన తన చిన్న కోడలి కోసం దిగివచ్చారు. ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణాయాదవ్ లక్నో కంటోన్మెంట్ శాసనసభ స్థానం నుంచి బరిలో దిగారు. ఆమె ప్రత్యర్థిగా గతంలో కాంగ్రెస్ యూపీ పీసీసీ చీఫ్ గా పని చేసి, బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషి ఉన్నారు. దీంతో లక్నోలో ఆమె భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆమె తోడి కోడలు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన తోడికోడలిని గెలిపించాలని కోరారు. ఈ సభకు ములాయం సింగ్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అపర్ణాయాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఒకే బహిరంగ సభలో మామతోపాటు కోడళ్లిద్దరూ కనిపించడంతో యూపీలో సమాజ్ వాదీ కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు. 

  • Loading...

More Telugu News