: అమీ జాక్సన్ అందుకే బెంబేలెత్తిపోతోందా?


కోలీవుడ్ సినిమాతో భారత సినీ పరిశ్రమలోకి ప్రవేశించి టాలీవుడ్ లో నటించి, బాలీవుడ్ లో పాగా వేసిన బ్రిటిష్ నటి అమీ జాక్సన్ బెంబేలెత్తిపోతోంది. రోబో 2.0 సినిమా షూటింగ్ కు వెళ్లేందుకు ముంబై నుంచి చెన్నై బయల్దేరే క్రమంలో ఫోన్ లో ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు ఓ మొబైల్ ఫోన్ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఫోన్ లోని రహస్య సమాచారం మొత్తం హ్యాకింగ్ కు గురైంది. దీంతో ఆమె వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో బట్టబయలయ్యాయి.

అమీ జాక్సన్ బ్రిటిషర్ కావడంతో భారతీయ సంప్రదాయాల కంటే స్వేచ్ఛ ఎక్కువగా ఉండడానికి తోడు మోడల్ కావడంతో... భారతీయులు ఊహించని, తీసుకునేందుకు ఇష్టపడని ఫోటోలు ఆమె పోన్ లో చాలా ఉన్నాయి. ఇవన్నీ బట్టబయలయ్యాయి. దీంతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన ఆమె వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసినా నియంత్రణ సాధ్యమవుతుందా? అన్న అనుమానంతో ఆమె బ్రిటన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపింది. కాగా, తాజాగా వేలంటైన్స్ డేను పురస్కరించుకుని ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

  • Loading...

More Telugu News