: తమిళనాడు కేబినెట్ కూర్పు వివరాలను గవర్నర్ కు పంపిన పళనిస్వామి
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తనకు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నుంచి ఆహ్వానం వచ్చిన నేపథ్యంలో అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామి తమ పార్టీ నేతలతో కలిసి ఈ రోజు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో భేటీ అయ్యారు. అనంతరం తమ కేబినెట్ కూర్పు వివరాలను పళనిస్వామి గవర్నర్ కు పంపారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించతలపెట్టిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అంశంపై ఈ భేటీలో చర్చించారు. పళనిస్వామి పంపించిన కేబినెట్ కూర్పు వివరాలను గవర్నర్ విద్యాసాగర్ రావు పరిశీలించనున్నారు.