: గవర్నర్ తో పళనిస్వామి భేటీ.. ఈ రోజు సాయంత్రమే ప్రమాణ స్వీకారం?


శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ జైలుకి వెళ్లడంతో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు ప్ర‌భుత్వ ఏర్పాటుపై చర్చించడానికి అన్నాడీఎంకే శాస‌న‌స‌భ ప‌క్ష‌నేత ప‌ళ‌నిస్వామిని మరోసారి రాజ్‌భ‌వ‌న్‌కు ర‌మ్మ‌ని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. గోల్డెన్ బే రిసార్టు నుంచి బ‌య‌లేదేరిన ప‌ళ‌నిస్వామి రాజ్‌భ‌వ‌న్ చేరుకున్నారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో భేటీ అయ్యారు. ప‌ళ‌నిస్వామితో మ‌రో ఐదుగురు అన్నాడీఎంకే నేత‌లు ఉన్నారు. మ‌రికాసేప‌ట్లో ప్ర‌భుత్వ ఏర్పాటుపై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్ర‌మే ప‌ళ‌నిస్వామి ప్ర‌మాణ స్వీకారం చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అన్నాడీఎంకే నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News