: హైద‌రాబాద్‌లో కలకలం రేపుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య


హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని దుండగులు దారుణంగా హతమార్చారు. మాన్ స్ట‌ర్.కామ్‌లో ప‌నిచేస్తోన్న సునీత అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిన్న ఉద‌యం ఇంటి నుంచి ఆఫీసుకి బ‌య‌లుదేరింది. అయితే, మ‌ళ్లీ సాయంత్రం ఆమె ఇంటికి చేరుకోలేదు. ఇంత‌లో మాదాపూర్‌లో జ‌నావాసం లేని ప్ర‌దేశంలో కాలి ఉన్న మృత‌దేహం ల‌భ్య‌మైంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప‌లు ఆధారాలు ల‌భించ‌డంతో సునీత త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు పిలిపించారు. ఆ మృత‌దేహం సునీత‌దేన‌ని కుటుంబ స‌భ్యులు చెప్ప‌డంతో దుండ‌గుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. త‌మ‌కు శత్రువులు లేర‌ని ఆమె కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. సునీతను దారుణంగా చంపి కాల్చేసిన వారు ఆమెకు తెలిసిన వారేనా? లేక గుర్తుతెలియ‌ని దుండ‌గులు ఆమెపై దారుణానికి ఒడిగ‌ట్టారా? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News