: శశికళ పాలిట సింహస్వప్నమైన బీవీ ఆచార్య!
బీవీ ఆచార్య... కర్ణాటక పబ్లిక్ ప్రాసిక్యూటర్. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, ఆయన బరిలోకి దిగితే, ప్రత్యర్థి న్యాయవాదులు పలాయనమేనని పేరు తెచ్చుకున్న ఆచార్య, శశికళ పాలిట సింహస్వప్నమై, ఆమె ఊచలు లెక్కబెట్టేలా చేశారు. నాడు తన వాదనలతో జయలలితను జైలుకు పంపించినది కూడా ఈయనే. 2004 నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించిన ఆయన జయలలిత అక్రమాస్తుల కేసులో ప్రభుత్వం తరఫున వాదించారు. శిక్ష పడేలా చేయగలిగారు. కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును కొట్టివేసిన తరువాత, అప్పటికే పదవీ విరమణ చేసినప్పటికీ, సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చింది ఈయనే. కాగా, పీపీ బాధ్యతలు నిర్వహిస్తూనే, ఆచార్య 2012లో వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.