: 'కసికళ'గా మారిన శశికళ టార్గెట్ ఎవరు?


ముఖంలో విచారం, బాధ కనిపిస్తున్నా ఎరుపెక్కిన కళ్లల్లో కోపాన్ని ప్రదర్శిస్తూ, 'కసికళ'గా మారిన శశికళ తదుపరి టార్గెట్ ఎవరన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పన్నీర్ సెల్వంను లక్ష్యంగా చేసుకుని, సీఎం పీఠాన్ని ఆయన చేతికి చిక్కకుండా పావులు కదిపి, దాదాపు విజయానికి దగ్గరైన ఆమె, ఇక ఆయన వెనకున్న వారిపై పంతం పట్టినట్టు తెలుస్తోంది. పన్నీర్ కుట్ర వెనుక బీజేపీ, డీఎంకే నేతలు ఉన్నారని అనుమానిస్తున్న ఆమె, ఇప్పటికే వారిపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఒకింత ఉద్వేగంతో పాటు ఆగ్రహంగా కూడా ఉన్నట్టు కనిపించిన శశికళ, జైలు నుంచి కూడా తాను సలహాలు, సూచనలు ఇస్తానని అన్నాడీఎంకే నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తన ఎత్తుగడలను అమలు చేయాలని, ఆందోళన అవసరం లేదని, పార్టీ విడిపోదని ఆమె చెప్పినట్టు సమాచారం. అమె ఏం శపథం చేశారు? ఆమె తదుపరి లక్ష్యం ఎవరు? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News