: పోయస్ గార్డెన్ నుంచి బెంగళూరు జైలుకు పయనమైన శశికళ


అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరుకు బయల్దేరారు. పోయస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు ఆమె రోడ్డు మార్గంలో బయల్దేరారు. తొలుత మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత సమాధిని ఆమె సందర్శించుకోనున్నారు. అక్కడ జయలలితకు నివాళి అర్పించిన తర్వాత... ఆమె నేరుగా బెంగళూరు వెళ్లి, ప్రత్యేక కోర్టులో లొంగిపోనున్నారు. అక్కడ నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారానికి ఆమె వెళ్లనున్నారు.

  • Loading...

More Telugu News