: అత్యవసరంగా పార్టీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని తమ ఎమ్మెల్యేలకు డీఎంకే పిలుపు
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్ ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ రోజు ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర అనిశ్చితికి ఈ రోజు ముగింపు పలకవచ్చని భావిస్తున్నారు. మరోవైపు తాను లొంగిపోవడానికి నాలుగు వారాల గడువు కావాలంటూ సుప్రీంకోర్టులో శశికళ వేసిన పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఇక తాము ఎలా వ్యవహరించాలనే అంశంపై ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ డీఎంకే అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ డీఎంకే ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని స్టాలిన్ ఆదేశించారు.