: తక్షణం లొంగిపోండి.. శశికళకు సుప్రీంకోర్టు ఆదేశం!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు సహనిందితురాలిగా ఉన్న శశికళకు నిన్న సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్య కారణాలు చూపుతూ తాను లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని ఆమె ఈ రోజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆమెకు గడువు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నిన్న చెప్పిన తమ తీర్పులో ఎటువంటి మార్పు చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ఆమె తక్షణం లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక ఆమె జైలుకి వెళ్లడం ఖాయమైంది.