: నాసా వల్లే కాలేదు... భారత్ చేసి చూపింది!
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేసి చూపించలేని కార్యాన్ని భారత్ అత్యంత సునాయాసంగా చేసింది. ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరిస్తూ, ఏకకాలంలో 96 అమెరికా ఉపగ్రహాలు సహా మొత్తం 104 శాటిలైట్లను నింగిలోకి పంపింది. ప్రస్తుతం ఇవన్నీ, తమ బేస్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపడాన్ని ప్రారంభించాయి. వివిధ దేశాలు, ఉపగ్రహాలను తయారు చేసి, వాటిని కక్ష్యలోకి పంపే కాంట్రాక్టులను అప్పగించిన వర్శిటీలు, సంస్థలు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నాయి. ఇక నాసా తన చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఉపగ్రహాలను ఒకేసారి ప్రవేశపెట్టే ధైర్యం చేయలేకపోయింది. అంతరిక్ష పరిజ్ఞానంలో సత్తా చాటుతున్న రష్యా సైతం ఇన్ని శాటిలైట్లను ఒకేసారి ప్రయోగించలేదు. ఇక పొరుగునే ఉన్న చైనా సైతం అసూయపడేలా భారత్ సృష్టించిన ఈ ఘన చరిత్రను, అద్భుత రికార్డును పడగొట్టాలంటే, అది తిరిగి మనకే సాధ్యమని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి.