: 'బావ బావే, మామ మామే' అంటూ ప్రచారంలో దూసుకెళుతున్న అపర్ణా యాదవ్
మూడో దశ అసెంబ్లీ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ సిద్ధమైన వేళ, ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ, ప్రజలను ఆకర్షించడంలో ముందున్నారు. ప్రతి ప్రసంగంలోనూ పార్టీ నేతాజీగా పిలుచుకునే తన మామ ములాయం సింగ్ యాదవ్, బావ వరుస అయ్యే సీఎం అఖిలేష్ ను ఆమె పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇద్దరిదీ ఒకే స్వభావమని, అభివృద్ధి పథంలో రాష్ట్రం వెళ్లాలని కోరేవారేనని, ఒకే తీరుతో ఆలోచిస్తారని చెబుతున్నారు. మరోసారి సమాజ్ వాదీని గెలిపిస్తే, రాష్ట్రంలో అద్భుతాలు చేసి చూపిస్తామని అంటున్నారు. తాను తొలుత రాష్ట్ర ఆడపడుచునని, ఆపైనే ములాయం కోడలినని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రజలు సైతం ఆమె సభలకు భారీగానే హాజరౌతూ, 'ఫ్యూచర్ మినిస్టర్' అని నినాదాలు చేస్తున్నారు. డింపుల్ యాదవ్ తనతో చాలా సన్నిహితంగా ఉంటారని, వ్యక్తిత్వాలు వేరైనా, తాము వాటిని పంచుకునేంత చనువుందని అన్నారు.